సవ్యసాచి ఫస్ట్ డే కలెక్షన్

Saturday,November 03,2018 - 01:01 by Z_CLU

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల 25 లక్షల షేర్ వచ్చింది. చైతూ నటించిన రీసెంట్ మూవీ శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ డే వసూళ్లతో పోల్చుకుంటే.. సవ్యసాచి మొదటి రోజు కలెక్షన్ తక్కువగా ఉంది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.05 కోట్లు
సీడెడ్ – రూ. 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.53 కోట్లు
ఈస్ట్ – రూ. 0.19 కోట్లు
వెస్ట్ – రూ. 0.17 కోట్లు
గుంటూరు – రూ. 0.46 కోట్లు
కృష్ణా – రూ. 0.23 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు