సవ్యసాచి టీజర్: నాగచైతన్య యాక్షన్ మేకోవర్

Monday,October 01,2018 - 11:36 by Z_CLU

అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సవ్యసాచి టీజర్ విడుదలైంది. ఈసారి యాక్షన్ మేకోవర్ ట్రై చేశాడు నాగచైతన్య. శైలజారెడ్డి అల్లుడు సినిమాలో కూల్ గా కనిపించిన చైతూ, సవ్యసాచిలో మోస్ట్ ఎగ్రెసివ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

సినిమా స్టోరీలైన్ పై ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా టీజర్ లోనే మేటర్ చెప్పేశారు మేకర్స్. నాగచైతన్యలో ఎక్స్ ట్రా పవర్ ఉందని, అతడి ఎడమ చేయి మేజిక్ చేస్తుందనే విషయాన్ని డైరక్ట్ గా చెప్పారు. అయితే మాధవన్ మేటర్ ఏంటనే విషయాన్ని మాత్రం టీజర్ లో రివీల్ చేయలేదు

నాగచైతన్య-నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను వచ్చేనెలలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.