SkyLab - సత్యదేవ్ సినిమా అప్ డేట్

Wednesday,October 13,2021 - 01:20 by Z_CLU

SatyaDev’s SkyLab Movie Updates

స‌త్య‌దేవ్‌నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ మెయిన్ లీడ్స్ గా వస్తున్న సినిమా స్కై ల్యాబ్. బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ఇది. 1979 లో సాగే పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న స్కై ల్యాబ్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి.

అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్‌ చానెల్స్‌, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. అలాంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా స్కైలాబ్ మూవీలో చూపించారు.

ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అవి కూడా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. రీసెంట్‌గా మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించారు. ఈ నెల‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తారు.. అలాగే త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసేలా మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

sky lab movie

న‌టీన‌టులు:
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు

మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వక్ ఖండేరావు
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
సహ నిర్మాత: నిత్యామీనన్‌
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్‌: రవితేజ గిరిజాల
మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి
ప్రొడక్షన్‌ డిజైన్‌: శివం రావ్‌
సౌండ్ రికార్డిస్ట్‌‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి
సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌
కాస్ట్యూమ్స్‌: పూజిత తడికొండ
పి.ఆర్‌.ఒ: వంశీ కాక

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics