Godse షూటింగ్ మొదలు !

Thursday,February 11,2021 - 01:24 by Z_CLU

‘బ్లఫ్ మాస్టర్’ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసి సూపర్ కాంబో అనిపించుకున్న సత్య దేవ్ -గోపి గణేష్ కాంబినేషన్ లో వస్తున్న ‘గాడ్ సే’ సినిమా షూటింగ్ మొదలైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో సత్య దేవ్ , హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లపై ఈరోజు నుండి కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. దాదాపు నెలాఖరు వరకు మొదటి షెడ్యుల్ జరగనుంది. సమాజంలో చదువుకున్న వారి ఇన్నర్ వాయిస్ ను గాడ్ సే క్యారెక్టర్ ద్వారా సినిమాలో చూపించబోతున్నాడు  గోపి గణేష్.

మంచి కథ , చక్కని సందేశంతో  తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమవుతుంది. CK స్క్రీన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత C కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తుండగా సురేష్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

Godse-Shoot-Begins-zeecinemalu

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ లోపు పూర్తి చేసి జులై లో థియేటర్స్ లోకి తీసుకురావడానికి  సన్నాహాలు చేస్తున్నారు.