Timmarusu - సత్యదేవ్ సినిమా రెడీ

Thursday,April 01,2021 - 12:28 by Z_CLU

సత్యదేవ్ హీరోగా మే 21న విడుదలకు సిద్ధమవుతోన్న ‘తిమ్మరుసు’

‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య’ వంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల చేస్తున్నారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

‘‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సత్యదేవ్‌ ఈ సినిమాలో పవర్ఫుల్ లాయర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది.

డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు.