చిరంజీవి అందుకే మెగాస్టార్ అయ్యారు

Monday,August 10,2020 - 01:07 by Z_CLU

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు నటుడు సత్యదేవ్. జీవితంలో ఫస్ట్ టైమ్ చిరంజీవిని కలిసిన Satyadev ఆ అనుభూతుల్ని షేర్ చేసుకున్నాడు. ఆ మూమెంట్ ను ఎలా భద్రపరుచుకున్నాడో వివరించాడు.

“మెగాస్టార్ ను కలవబోతున్నాననే ఆనందంతో అప్పటివరకు లాక్ డౌన్ లో పెంచిన గడ్డం గీసేశాను. మంచి చొక్కా కొనుక్కొని వేసుకొని వెళ్లాను. Megastar Chiranjeevi గారంటే అందర్లానే నాక్కూడా చాలా ఇష్టం. ఆయన్ను కలిసిన మూమెంట్ అలానే ఉండిపోవాలనేది నా కోరిక. అందుకే గుర్తుగా ఆ చొక్కాను మళ్లీ అలానే మడతపెట్టి, కవర్లో పెట్టి బీరువాలో పెట్టేశాను.”

మనుషుల్ని అర్థం చేసుకోవడంలో చిరంజీవిని మించిన వారు లేరంటున్నాడు సత్యదేవ్. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారని చెబుతున్నాడు

“Chiranjeevi గారు, నేను మాట్లాడుకుంటున్నాం. అదొక అద్భుతమైన మూమెంట్. నా జీవితంలో బెస్ట్ మూమెంట్. ఎవరైనా రికార్డ్ చేస్తే బాగుణ్ను అని నాకు మనసులో ఉంది. కానీ ఎవ్వరికీ చెప్పలేను. అది చిరంజీవి గారు గ్రహించారు. పక్కనే ఒకరు ఉంటే ఆయనతో వీడియో తీయమని చెప్పారు. దటీజ్ చిరంజీవి. మనుషుల్ని ఆయన ఆ రేంజ్ లో అర్థం చేసుకుంటారు. అందుకే మెగాస్టార్ అయ్యారు.”

రీసెంట్ గా సత్యదేవ్ నటించిన 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు OTT వేదికలపై రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు Satyadev.