SatyaDev Mass first Look as Mercury Soori in Full Bottle Movie Released
బహుముఖ నటుడు సత్యదేవ్ (SatyaDev), దర్శకుడు శరణ్ కొప్పిశెట్టితో కలిసి ‘ఫుల్ బాటిల్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
‘తిమ్మరుసు’ తర్వాత సత్యదేవ్‌తో శరణ్ కొప్పిశెట్టి (Sharan Koppisetty) రెండోసారి కలిసి చేస్తున్న చిత్రం ఇది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు యూనిక్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ఈరోజు సినిమా ఫస్ట్ లుక్‌తో ఉత్కంఠను పెంచారు.
ఫుల్ బాటిల్ (Full Bottle Movie) ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యాచీగా, కలర్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని పోస్టర్ చూస్తే తెలుస్తోంది.
చమత్కారమైన గాగుల్స్‌లో సత్య దేవ్ నవ్వుతూ నిల్చున్నాడు. అతడి 2 చేతుల్లో 2 మందు గ్లాసులున్నాయి. పోస్టర్ లో ఫుల్ బాటిల్, ఆటో, బీచ్, లైట్ హౌజ్, కోడి పుంజు లాంటివి చూపించారు. వీటితో పాటు కాకినాడ పోర్టు అనే బోర్డు కూడా ఉంది. సో.. ఈ సినిమా కాకినాడ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందన్నమాట.
సత్య దేవ్ పాత్ర ఈ సినిమాలో సరదాగా ఉంటుందనే విషయం అతడి లుక్ చూస్తేనే అర్థమౌతోంది. పైగా అతడి పాత్రకు మెర్క్యూరీ సూరి అనే పెట్టడంలోనే ఫన్ కనిపిస్తోంది.
డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో సంజన ఆనంద్ (Sanjana Anand) హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎస్‌డి కంపెనీ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్న ‘ఫుల్ బాటిల్’ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో బ్రహ్మాజీ, సాయికుమార్, రాశి, వైవా హర్ష, సునీల్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
