సూర్య సినిమాకు సత్యదేవ్ డబ్బింగ్

Friday,October 02,2020 - 05:56 by Z_CLU

త్వరలోనే “ఆకాశం నీ హద్దురా” సినిమాతో పలకరించబోతున్నాడు సూర్య. సుధా కొంగర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో ఎట్రాక్షన్ తోడైంది. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ కు మరో హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడు.

ప్రస్తుతం మంచి స్వింగ్ మీదున్నాడు సూర్య. హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో ఈ డబ్బింగ్ ఆఫర్ వచ్చింది. సూర్య సినిమా కావడంతో ఆలస్యం చేయకుండా ఓకే చేశాడు
సత్యదేవ్. డబ్బింగ్ కూడా పూర్తయింది

నిజానికి ఇప్పుడుప్పుడే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు సూర్య. రీసెంట్ గా వచ్చిన బందోబస్త్, అంతకంటే ముందొచ్చిన గ్యాంగ్ అనే సినిమాకు సూర్యానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. కానీ “ఆకాశం నీ హద్దురా” సినిమాకు మాత్రం సత్యదేవ్ తో ట్రై చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా డైరక్ట్ గా ఓటీటీలోకి రాబోతోంది.