నటనే నా ప్రాణం: సత్యదేవ్

Thursday,May 21,2020 - 03:37 by Z_CLU

ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోల్లో టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకున్నాడు సత్య దేవ్. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసి ‘జ్యోతిలక్ష్మి’తో హీరోగా మారాడు సత్య. ప్రస్తుతం హీరోగా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ నటుడు.. త్వరలోనే డైరెక్షన్ చేయబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. దీంతో ఇక యాక్టింగ్ కి గుడ్ బై చెప్తాడని కూడా కొందరు రాసేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చాడు సత్యదేవ్.

రైటర్ గా కొన్ని కథలు రాసుకున్నా కానీ ఇప్పుడే డైరెక్షన్ చేసే ఆలోచన లేదని తెలిపాడు సత్య. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఇదే విషయం చెప్తే తానేదో డైరెక్షన్ చేయబోతున్నానని అంతా అనుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా యాక్టింగ్ మీదే ఉందని స్పష్టంచేశాడు. సత్యదేవ్ ప్రకటనతో అతడు డైరక్షన్ చేయబోతున్నాడనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. త్వరలోనే నితిన్ హీరోగా రాబోతున్న పవర్ పేట మూవీలో ఓ మంచి రోల్ చేయబోతున్నాడు సత్యదేవ్.