Godse - సత్యదేవ్ కొత్త సినిమా
Tuesday,January 05,2021 - 10:02 by Z_CLU
టాలెంట్ ఉన్న నటుడిగా ఇమేజ్ తెచ్చుకొని, డిఫరెంట్ స్క్రిప్టులను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా గోపిగణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిశోర్ కీలక పాత్రధారులు.
సత్యదేవ్, గోపిగణేష్ పట్టాభి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అలాంటి మూవీ తర్వాత మరోసారి వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఈ ‘గాడ్సే’.
ఈ మూవీలో సత్యదేవ్ చాలా పవర్‌ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడనే విషయం టైటిల్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. గన్స్‌తో, ఇంటెన్స్ లుక్స్‌తో ఆయన కనిపిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగే యాక్షన్ మూవీ ఇది.
దర్శకత్వం వహిస్తుండటంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను గోపిగణేష్ పట్టాభి అందిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

తారాగణం:
సత్యదేవ్, నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిశోర్.
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: గోపిగణేష్ పట్టాభి
నిర్మాత: సి. కల్యాణ్
బ్యానర్: సి.కె. స్క్రీన్స్
సహ నిర్మాత: సి.వి. రావు
పీఆర్వో: వంశీ-శేఖర్.