క్షమాపణ చెప్పిన సత్యరాజ్

Friday,April 21,2017 - 01:26 by Z_CLU

ఎప్పుడో తొమ్మిదేళ్ళ కిందట కావేరి జలాల విషయంలో జరిగిన గొడవల్లో కర్ణాటకకి విరుద్ధంగా మాట్లాడాడు అనే కారణంతో అక్కడ బాహుబలి 2 సినిమా విడుదలను అడ్డుకున్నారు. ఈ విషయంలో రాజమౌళి రిక్వెస్ట్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకి అన్ని వైపుల నుండి కావాల్సినంత సపోర్ట్ వచ్చింది. ఇంతలో జరిగిన దానికి క్షమాపణ కోరుతూ సత్యరాజ్ కూడా వీడియోని రిలీజ్ చేశారు.

తొమ్మిదేళ్ళ నాటి ఆ వివాదంలో తమిళులకు జరిగిన అన్యాయం విషయంలోనే తాను నోరు విప్పానని, ఆ టైం లో కర్ణాటక లో ఉన్న తమిళులు పడుతున్న కష్టాన్ని మైండ్ లో పెట్టుకుని, రియాక్ట్ అయిన చాలామందిలో తానూ ఒకడినని పేర్కొన్న సత్యరాజ్, బాహుబలి సినిమాలో తానో నటుడిని మాత్రమేనని, తోమిదేళ్ళ క్రితం చేసిన కామెంట్స్ కి, బాహుబలికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పుకున్నారు.

‘ఒక సందర్భంలో నేనన్న మాటలు వేలమంది ఎంతో కష్టపడితే తెరకెక్కిన సినిమాపై ప్రభావం చూపిస్తుదంటే క్షమాపణ చెప్పడానికైనా సిద్ధమే’ అని చెప్పిన సత్యరాజ్, ఫ్యూచర్ లో తన వల్ల సినిమాకి సమస్య వస్తుందనుకుంటే దయచేసి తనతో సినిమా చేయవద్దని, ఒక నటుడి కన్నా, తమిళుడిగానే ఎంతో గర్విస్తానని ముగించారు. సత్యరాజ్ క్షమాపణలతో కర్నాటకలో బాహుబలి-2 విడుదలకు లైన్ క్లియర్ అయింది.