Godse Movie - సత్యదేవ్ సినిమా టీజర్ ఎలా ఉందంటే..?

Monday,December 20,2021 - 04:58 by Z_CLU

Satya Dev’s Godse Movie Teaser Review

వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసి, సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే .. 78 సెక‌న్ల రన్ టైమ్. ఇందులో సేవ పేరుతో దోచుకుంటూ దేశంలోని యువ‌త స‌హా అంద‌రి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై ఓ యువ‌కుడు ఎలా తిరుగుబాటు చేశాడ‌నేదే గాడ్సే సినిమా అని అర్థ‌మ‌వుతుంది. టీజ‌ర్‌ చాలా రేసీగా ఇంటెన్స్‌తో ఉంది.

‘ఏ నినాదం వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్ర‌జ‌లు మోస‌పోతూనే ఉంటారు’ అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. స‌త్య‌దేవ్ పాత్ర‌ధారి అయిన గాడ్సేను ప‌ట్టుకోవ‌డానికి మిల‌ట‌రీ బ‌ల‌గాలు ప్ర‌య‌త్నిస్తుండ‌టం.. చేతిలో గ‌న్ ప‌ట్టుకుని స‌త్య‌దేవ్ స్టైల్‌గా న‌డుచుకుంటూ రావ‌డం వంటి స‌న్నివేశాలు టీజ‌ర్‌లో చూడొచ్చు. అలాగే నాగ‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి , థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ స‌హా ప‌లు పాత్ర‌ధారుల‌ను కూడా టీజ‌ర్‌లో ప‌రిచ‌యం చేశారు.

గాడ్సే అనేది స‌త్య‌దేవ్ అస‌లు పేరు కాద‌నేది మ‌రో సన్నివేశంలో ఎలివేట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అర్హ‌త గ‌ల గ్రాడ్యుయేట్స్ అంద‌రికీ ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తారు. ‘సాధార‌ణంగా ఉద్యోగం చేస్తే డ‌బ్బులొస్తాయ్‌, వ్యాపారం చేస్తే డ‌బ్బులొస్తాయ్‌. వ్య‌వ‌సాయం చేస్తే డ‌బ్బులొస్తాయ్‌.. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వంద‌ల, వేల, ల‌క్ష‌ల కోట్లు ఎలా వ‌స్తున్నాయిరా? బికాజ్ యువార్ లూటింగ్ ప‌బ్లిక్ మ‌నీ.. ఇన్ ది నేమ్ ఆఫ్ స‌ర్వీస్’ అని టీజ‌ర్ చివ‌ర‌లో ఎమోష‌న‌ల్‌గా, ఇంటెన్స్‌గా స‌త్య‌దేవ్ చెప్పిన డైలాగ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది.

బ్యాన‌ర్‌: సీకే స్క్రీన్స్‌
నిర్మాత‌: సి.క‌ళ్యాణ్‌
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం : గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : సి.వి.రావు
మ్యూజిక్ : సునీల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫీ : సురేష్ ఎస్‌
ఎడిట‌ర్ : సాగ‌ర్‌
ఆర్ట్ : బ్ర‌హ్మ క‌డ‌లి
యాక్ష‌న్‌: న‌భా