సత్యదేవ్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా సినిమా

Tuesday,December 31,2019 - 06:20 by Z_CLU

డిఫరెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నాడు సత్యదేవ్. ఇక క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేయడం నిత్యామీనన్ స్పెషాలిటీ. ఇలాంటి ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా అది సమ్ థింగ్ స్పెషల్ మూవీ అనిపించుకుంటుంది. అలాంటి సినిమానే ఒకటి రాబోతోంది.

సత్యదేవ్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా ఎనౌన్స్ అయింది. 1979 బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అలా అని ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కాదు. ఇదొక కొత్త కథ.

అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. పృథ్వీ పిన్న‌మరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వ‌క్ కందెరావ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

న‌టీన‌టులు:
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ కందెరావ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాది
ఎడిటింగ్‌: ర‌వితేజ గిరిజాల‌
మ్యూజిక్‌: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి
సౌండ్ డిజైన్‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి, ధ‌నుష్ న‌య‌నార్‌