మూవీ కార్నికల్: అభినేత్రి

Saturday,March 03,2018 - 09:51 by Z_CLU

కాసేపు అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపిస్తుంది. ఆ వెంటనే మోడ్రన్ ముంబయి భామలా మెరిసిపోతుంది. ఇలా తమన్నాలోని రెండు వేరియేషన్స్ ను ఒకేసారి చూడాలనుకుంటే అభినేత్రి మూవీ చూడాల్సిందే. రెండు డిఫరెంట్ షేడ్స్ల్ లో మిల్కీబ్యూటీ నటించిన అభినేత్రి.. ఈరోజు రాత్రి 8 గంటలకు SATURDAY MOVIE CARNIVALగా జీ సినిమాలు ఛానెల్ లో ప్రసారం అవుతుంది.

కేవలం తమన్న మాత్రమే ఎట్రాక్షన్ కాదు ఈ సినిమాలో. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా స్టెప్పులు, సోనూ సూద్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్.. వీటితో పాటు సప్తగిరి, షకలక శంకర్ ల బ్రహ్మాండమైన కామెడీ.. అభినేత్రి సినిమాలో మెయిన్ హైలెట్స్. ఇప్పటివరకు వచ్చిన ఎన్నో కామెడీ-హారర్ సినిమాలకు భిన్నమైనది ఈ అభినేత్రి. జీ సినిమాలు ఛానెల్ తో పాటు జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్ లో ఈ సినిమాను ఫుల్ క్లారిటీ, అత్యద్భుతమైన సౌండ్ తో చూసి ఎంజాయ్ చేయండి.

నటీనటులు – తమన్న, ప్రభుదేవా, సోనూసూద్, సప్తగిరి, షకలక శంకర్, ఫృధ్వి
డైలాగ్స్ – కోన వెంకట్
మ్యూజిక్ – సాజిద్ వాజిద్
సినిమాటోగ్రఫీ – మనీష్ నందన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – ఏఎల్ విజయ్