రూటు మారుస్తున్న ఫ్యామిలీ డైరెక్టర్ ?

Thursday,August 06,2020 - 02:25 by Z_CLU

వరుసగా ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే ఆ దర్శకుడిపై ఓ ఇమేజ్ పడిపోవడం ఖాయం. ఇదే రీతిలో వరుసగా కుటుంబ కథా సినిమాలతో ఫ్యామిలీ డైరెక్టర్ బ్రాండ్ సొంతం చేసుకున్నాడు సతీష్ వేగేశ్న. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచి వాడవురా ఇలా వరుస పెట్టి ఫ్యామిలీ సినిమాలు తీసిన ఈయన ఇప్పుడు తన పంథా మార్చుకొని కొత్త జోనర్ సినిమా చేయబోతున్నారని టాక్. తనయుడు సమీర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట సతీష్.

ఆ సినిమాను యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కించనున్నారని సమాచారం. తన మార్క్ ఫ్యామిలీ సీన్స్ కూడా ఉన్నప్పటికీ యూత్ కి నచ్చే అంశాలే ఎక్కువగా ఉంటాయని, తనయుడు సమీర్ తో పాటు ఇందులో మరో యువ హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది. ఈ విషయంపై ఫ్యామిలీ డైరెక్టర్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని కుదిరితే త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.