Satish Vegesna - దగ్గుబాటి ''మనం''

Sunday,December 27,2020 - 03:34 by Z_CLU

అక్కినేని హీరోలంతా కలిసి చేసిన మనం సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. అక్కినేని హీరోలు కలకాలం చెప్పుకునే సినిమా అది. అలాంటి సినిమా ఒకటి వెంకటేష్-రానాతో చేయాలనేది సురేష్ బాబు కోరిక. ఇప్పుడా కోరిక నెరవేరేలా ఉంది

దగ్గుబాటి హీరోలతో ‘మనం’ టైపు కథ ఒకటి ప్లాన్ చేశాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఆల్రెడీ సురేష్ బాబుకు లైన్ కూడా వినిపించాడట. ఈ విషయాన్ని సురేష్ బాబు కన్ ఫర్మ్ చేశారు.

satish-vegesna-plans-manam-type-movie-with-venkatesh-rana2

మనం టైపు కథ కోసం వెయిట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు.. సతీష్ వేగేశ్న రాసుకున్న కథ నచ్చితే.. తనే నిర్మాతగా వెంకీరానాతో ఆ సినిమా తీస్తానని ప్రకటించాడు.

ప్రస్తుతం కొడుకును హీరోగా పరిచయం చేస్తూ కోతికొమ్మచ్చి అనే సినిమా చేస్తున్నాడు సతీష్ వేగేశ్న. ఆ మూవీ పూర్తయిన తర్వాత ”దగ్గుబాటి మనం” పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.

Also Check – నారప్పను చూశారా?