Kothi Kommachi .. మరో మంచి టైటిల్

Saturday,August 29,2020 - 12:26 by Z_CLU

 

‘శతమానం భవతి’తో మంచి విజయం అందుకోని నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న తన నెక్స్ట్ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. శ్రీహరి తనయుడు మేఘంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న హీరోలుగా సతీష్ తెరకెక్కించనున్న సినిమాకు ‘కోతి కొమ్మచ్చి’ (Kothi Kommachi) అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని దర్శకుడి పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేసారు.

సతీష్ వేగేశ్న (Satish Vegesna) గత సినిమాలన్నీ అచ్చ తెలుగు టైటిల్స్ తో తెరకెక్కాయి. ఇప్పుడు అదే రీతిలో అందరికీ తెలిసిన తెలుగు టైటిల్ ని ఫైనల్ చేసుకొని చిన్నతనంలో అందరూ ఆడే ఆటను గుర్తుచేస్తున్నారు.ఇప్పటి వరకు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న సతీష్ వేగేశ్న ఈ సినిమాను యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి కొత్త పంథాలో వెళ్ళబోతున్నాడు.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై MLV సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మిగతా వివరాలు వెల్లడించనున్నారు.