ఇది రీమేక్ సినిమానే కానీ...!

Saturday,January 11,2020 - 03:53 by Z_CLU

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఎంత మంచివాడవరు సినిమా ఓ గుజరాతీ సినిమాకు రీమేక్. ఈ విషయాన్ని అంగీకరించిన దర్శకుడు వేగేశ్న సతీష్.. పేరుకు తమది రీమేక్ సినిమానే అయినప్పటికీ కథలో చాలా మార్పులు చేశామంటున్నాడు. 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా కొత్తదనంతో ఉంటుందని చెబుతున్నాడు.

“గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ నుండి కేవలం ఎమోషన్ సప్లై అనే ఒక్క పాయింట్ తప్ప, చాలా వరకు మార్పులు చేసాం. హీరోయిన్ క్యారెక్టర్ దగ్గరి నుండి కథ నడిచే విధానం ప్రతీది మార్చుకున్నాం. కథగా చెప్పుకుంటే ‘ఆక్సిజన్’ కథ వేరు.. ‘ఎంత మంచివాడవురా’ వేరు… ఒక్క ఎమోషన్ సప్లై అనే పాయింటే ఆ కథ నుండి తీసుకున్నాం.”

“కళ్యాణ్ రామ్ కి ‘ఆక్సిజన్’ సినిమా గురించి చెప్పగానే ఆ సినిమా ఆయనకు నచ్చలేదు. అప్పుడు డైరెక్టర్ వెర్షన్ వినమని నిర్మాతలు కోరడంతో.. నేను రంగంలోకి దిగాను. నేను చెప్పిన వెర్షన్ విన్న తర్వాత ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు. ఆయన ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేశాం.”