షూటింగ్ పూర్తిచేసుకున్న సంక్రాంతి సినిమా

Thursday,December 01,2016 - 08:02 by Z_CLU

సంక్రాంతి బరిలో ఏమాత్రం వెనక్కి తగ్గని హీరో శర్వానంద్. చిరంజీవి, బాలకృష్ణ లాంటి బడా స్టార్స్ తో పోలిస్తే, శర్వానంద్ మార్కెట్, మూవీ బడ్జెట్ తక్కువే అయినప్పటికీ… సంక్రాంతిని మాత్రం మిస్ అవ్వడం లేదు శర్వా. లాస్ట్ ఇయర్ ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో చాపకిందనీరులాా సైలెంట్ హిట్ కొట్టిిన ఈ యంగ్ స్టర్… ఈసారి కూడా అదే సక్సెస్ ను రిపీట్ చేయాలనుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో కలిసి శతమానం భవతి అనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సిద్ధంచేస్తున్నాడు. అందుకే ఈ సినిమా సంక్రాంతికి పర్ ఫెక్ట్ అని ఫీలవుతున్నాడు.

sathamanam

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన శతమానం భవతి సినిమా తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా సైమల్టేనియస్ గా కంటిన్యూ చేస్తున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. తాత-మనవడు మధ్య వచ్చే ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.