శాతకర్ణి ఆడియో లాంఛ్ కు ఏర్పాట్లు పూర్తి

Monday,December 26,2016 - 09:30 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో తిరుపతిలో ఈ సినిమా పాటలు ఘనంగా విడుదలకానున్నాయి. బాలయ్య నటించిన ప్రతిష్టాత్మక వందో చిత్రం కావడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖులు హాజరు అవుతున్న ఈవెంట్ కావడంతో.. భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లను చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. అందుకే ఆడియోపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. చిరాంతన్ భట్ అందించిన సంగీతం కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో యూనిట్ ఉంది. ఎందుకంటే గతంలో క్రిష్-చిరాంతన్ కాంబోలో వచ్చిన కంచె సినిమా పాటలు కూడా హిట్ అయ్యాయి. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.