శాతకర్ణి రోడ్ మ్యాప్

Saturday,November 19,2016 - 01:43 by Z_CLU

ఇదేదో బస్ సర్వీస్ కాదు. శాతకర్ణి సర్వీస్. బాలయ్య తన ప్రతిష్టాత్మక వందో సినిమాకు తయారుచేసుకున్న రూట్ మ్యాప్. ఈ మ్యాప్ ప్రకారమే మొత్తం జరగాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన బాలయ్య… ఇప్పుడు ఫేజ్ -2లోకి ఎంటర్ అయ్యాడు. ఫేజ్-1లో భాగంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవాన్ని అమరావతిలో పెట్టాడు. ఆ ఈవెంట్ అందర్నీ బాగానే ఎట్రాక్ట్ చేసింది.

ఇప్పుడు ఫేజ్-2 తిరుపతికి షిఫ్ట్ అయింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను తిరుపతిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య. కుదిరితే వచ్చేనెల 10 లేదా 17న శాతకర్ణి పాటల్ని తిరుపతిలో గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇక ఫేజ్-3లో హైదరాబాద్ ను టార్గెట్ చేశాడు బాలయ్య. గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ కాపీని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చూపించబోతున్నాడు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రీమియర్ ఉంటుంది. దీనికి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు.