ఫస్ట్ లుక్ రిలీజ్

Saturday,October 08,2016 - 06:20 by Z_CLU

నందమూరి అభిమానులకు దసరా సంబరాలు షురూ అయిపోయాయి. బాలయ్య నటిస్తున్న సెంచరీ మూవీ, మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్టు… గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి కాసేపటి కిందట ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్, ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు… నిర్మాతల్లో ఒకరైన క్రిష్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. అలనాటి అమరావతిని పాలించిన శాతకర్ణి మహారాజు లుక్ లో బాలయ్య అదిరిపోయాడు. ఆ మీసకట్టు, డ్రెస్సింగ్ … క్యారెక్టర్ కు సరిగ్గా సూట్ అయింది.

        నిజానికి శాతకర్ణి సినిమాకు సంబంధించి ఇప్పటికే బాలయ్య స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. కానీ మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మాత్రం ఇదే. దసరా కానుకగా ఈనెల 11న గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ను విడుదల చేయబోతున్నారు. శ్రియ హీరోయిన్ గా, మహారాణి పాత్రలో హేమమాలిని నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.