శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..?

Wednesday,November 16,2016 - 02:30 by Z_CLU

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా ఆడియో లాంచ్ వేదిక కన్ ఫం అయింది. విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియోని తిరుపతిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. గతంలో బాహుబలి ఆడియో వేడుక కూడా ఇక్కడే జరిగింది.

4

డిసెంబర్ 10 లేదా 17న ఆడియోని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, ట్రేలర్ ని డిసెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి గతంలో కంచె సినిమాకి సంగీతం అందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరాంతన్ భట్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.