SarkaruVaariPaata ట్రైలర్ తో రెడీ అవుతున్న మహేష్

Thursday,April 28,2022 - 04:38 by Z_CLU

‘Sarkaru Vaari Paata’ Theatrical Trailer On May 2nd

సూపర్ స్టార్ మహేష్ బాబు -పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ నుండి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన సూపర్ ఫ్యాన్స్ కి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మే 2న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా సోషల్ మీడియాలో ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో మహేష్ బాబు కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపిస్తూ మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. రెండు చేతుల్లో తాళల గుత్తులు పట్టుకొని వంటికాలిపై నిల్చుని రౌడీ గ్యాంగ్ తో హైవోల్టేజ్ ఫైట్ చేస్తున్న విజువల్ పోస్టర్ లో కనిపించడం అభిమానులని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది.

మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics