Sarkaru Vaari Paata ఐదు రోజుల్లో 100 కోట్ల షేర్

Tuesday,May 17,2022 - 01:06 by Z_CLU

 Sarkaru Vaari Paata, Fastest 100 Cr+ Share Worldwide In TFI

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఫస్ట్ వీకెండ్ 95 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా ఐదో రోజు 100 కోట్ల షేర్ క్రాస్ చేసి టాలీవుడ్లో ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది. ఒక రీజనల్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అరుదైన రికార్డు కావడంతో టీంతో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

తాజాగా మాస్ సెలెబ్రేషన్స్ పేరుతో టీం అంతా కర్నూలులో ప్రేక్షకుల నడుమ గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకొని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మహేష్ థాంక్స్ చెప్పుకున్నాడు.

 

‘సర్కారు వారి పాట ఐదు రోజుల’ ఐదు రోజుల షేర్ డీటెయిల్స్

నైజాం – 31.47Cr

సీడెడ్ – 10.44Cr

ఉత్తరాంద్ర – 10.25Cr

గుంటూరు – 7.85Cr

ఈస్ట్ – 7.05Cr

కృష్ణా  – 5.76Cr

వెస్ట్ – 4.65Cr

నెల్లూరు – 3.12Cr

Total AP/TG – 80.59Cr
K

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – 7.75Cr

ఓవర్సీస్ – 12.1Cr

Total WW Share – 100.44Cr