సరిలేరు నీకెవ్వరు టీజర్ రివ్యూ

Friday,November 22,2019 - 06:21 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సరిలేరు నీకెవ్వరు సందడి షురూ అయింది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. చెప్పినట్టుగానే టైమ్ చూసి మరీ టీజర్ రిలీజ్ చేశారు. ఇలా రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో అలా ట్రెండింగ్ అయింది టీజర్. రిలీజైన 10 నిమిషాలకే లక్ష లైకులు వచ్చాయి.

ఇక టీజర్ విషయానికొస్తే.. మహేష్ లో మాస్ యాంగిల్ ను ఎలివేట్ చేసేలా ఉంది టీజర్. సైనికుడి గెటప్ లో మహేష్ అదిరిపోయాడు. దీనికి తోడు 2 డైలాగ్స్ టీజర్ కు స్పెషల్ లుక్ తీసుకొచ్చాయి

భయపడేవాడే బేరానికొస్తాడు..మన దగ్గర బేరాల్లేవమ్మా.
ప్రతి సంక్రాంతికి అల్లుడొస్తాడు.. ఈ సంక్రాంతి మొగుడొచ్చాడు.

హీరోయిన్ రష్మిక మినహా.. ముఖ్యపాత్రలన్నింటినీ టీజర్ లోనే పరిచయం చేశారు. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్ రాజ్ పాత్రల్ని టీజర్ లో ఇంట్రడ్యూస్ చేశారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ను నెక్ట్స్ లెవెల్లో నిలబెట్టింది.

అనీల్ రావిపూడి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కోసం శరవేగంగా ముస్తాబవుతోంది. జనవరి 11న థియేటర్లలోకి వస్తోంది సరిలేరు నీకెవ్వరు సినిమా.