సరిలేరు సాంగ్స్ హంగామా షురూ

Friday,November 29,2019 - 02:03 by Z_CLU

సంక్రాంతి సినిమాలకు సంబంధించి మొన్నటివరకు అల వైకుంఠపురములో సాంగ్స్ హంగామా చూశాం. ఇకపై సరిలేరు నీకెవ్వరు పాటల హంగామా చూడబోతున్నాం. అవును.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 2 నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నారు.

తమన్ కంపోజ్ చేసిన అల వైకుంఠపుములో సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో అందరి ఫోకస్ ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ పై పడింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవిశ్రీ ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వస్తున్నాయి సరిలేరు సాంగ్స్.

ముందుగా డిసెంబర్ 2న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత 9, 16, 23, 30 తేదీల్లో వరుసగా లిరికల్ వీడియోస్ రాబోతున్నాయి. ఇలా షెడ్యూల్ మొత్తం ఒకసారి రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సాంగ్స్ అన్నీ ఒకెత్తయితే.. డిసెంబర్ 30న న్యూ ఇయర్ స్పెషల్ గా రాబోతున్న సాంగ్ మరో ఎత్తు అంటోంది యూనిట్.

సంక్రాంతికి మహేష్-బన్నీ ఏ రేంజ్ లో పోటీపడుతున్నారో.. వాళ్ల సినిమాలతో దేవిశ్రీప్రసాద్-తమన్ కూడా అదే రేంజ్ లో పోటీపడుతున్నారు. ప్రస్తుతానికైతే తమన్ ముందున్నాడు. DSP ఏ రేంజ్ లో తన ట్యూన్స్ తో మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.