3 రోజుల్లో 100 కోట్లు.. సరిలేరు నీకెవ్వరు

Tuesday,January 14,2020 - 02:51 by Z_CLU

ఇట్స్ అఫీషియల్.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు జస్ట్ 3 రోజుల్లో 103 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసి మరీ కలెక్షన్ డీటెయిల్స్ బయటపెట్టాడు నిర్మాత అనీల్ సుంకర. దీంతో మహేష్ స్టామినా ఏంటో మరోసారి ట్రేడ్ కు తెలిసొచ్చింది.

ఇప్పటివరకు సంక్రాంతి బరిలో నిలిచిన 3 సినిమాలూ క్లిక్ అవ్వడం విశేషం. రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాకు 3 రోజుల్లో 150 కోట్లు (ఆల్-లాంగ్వేజెస్) గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అటు బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు మొదటి రోజే వరల్డ్ వైడ్ 85 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు నిర్మాత చినబాబు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కలెక్షన్లు కూడా బయటకొచ్చాయి.