సరిలేరు నీకెవ్వరు 5 రోజుల కలెక్షన్

Thursday,January 16,2020 - 11:47 by Z_CLU

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపిస్తోంది. నిన్నటితో 5 రోజులు పూర్తిచేసుకున్న ఈ మూవీ, తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఈ క్రమంలో నైజాంలో పెద్ద రికార్డు సృష్టించాడు మహేష్. 5 రోజుల వసూళ్లతో నైజాంలో నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేశాడు.

మరోవైపు ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్-ఈవెన్ అయినట్టు ప్రకటించాడు నిర్మాత అనీల్ సుంకర. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అయినట్టు ఎనౌన్స్ చేశాడు. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి అన్ని ఏరియాల్లో ఈ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 76 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది సరిలేరు నీకెవ్వరు సినిమా.

ఏపీ, నైజాం 5 రోజుల షేర్స్
నైజాం – రూ. 22.5 కోట్లు
సీడెడ్ – రూ. 9.75 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 10.05 కోట్లు
ఈస్ట్ – రూ. 6.22 కోట్లు
వెస్ట్ – రూ. 4.54 కోట్లు
గుంటూరు – రూ. 7.19 కోట్లు
నెల్లూరు – రూ. 2.42 కోట్లు
కృష్ణా – రూ. 5.55 కోట్లు