Sardar ఇండియన్ స్పై స్టోరీ

Monday,October 17,2022 - 06:47 by Z_CLU

‘Sardar’ is a indian spy story says Hero Karthi

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ ల లేటెస్ట్ మూవీ ‘సర్దార్’. తాజాగా ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా అక్టోబర్ 21న దీపావళి స్పెషల్ గా థియేటర్స్ లోకి వస్తుంది.

ట్రైలర్ లో కార్తి మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో కనిపించాడు. సైనిక సమాచారం ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా (RAW) సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరిగా అది ఎవరికీ చిక్కింది, అందులో వున్న రహస్యాలు ఏమిటనే కథతో సినిమా తెరకెక్కింది.

ఇండియన్ స్పై స్టోరీ తో రూపొందిన కథతో సర్దార్ తెరకెక్కిందని, ఈ కథ కోసం మిత్రన్ రెండేళ్ళు వర్క్ చేశారని చాలా రీసెర్చ్ చేశారని కార్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఈ కథను రియల్ ఇన్సిడెంట్ తీసుకొని ఫిక్షనల్ గా మిత్రన్ రాసుకున్నారని కార్తి అన్నాడు. ఇందులో నా కేరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపాడు. అలాగే ఇందులో ప్రతీ పాత్ర కు ఓ డిఫరెంట్ షెడ్ ఉంటుందని అన్నాడు.

కార్తి సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చుంకీ పాండే, రజిషా విజయన్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా రిలీజ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.