సెప్టెంబర్‌ 15న శింబు, నయనతార 'సరసుడు' రిలీజ్‌

Sunday,September 10,2017 - 11:00 by Z_CLU

హీరో శింబు, అందాల తారలు నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్‌లో తమిళ్‌, తెలుగు భాషల్లో టి.రాజేందర్‌ నిర్మించిన చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రం తమిళంలో ‘ఇదు నమ్మ ఆళు’ పేరుతో రిలీజై 27 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి శింబు కెరీర్‌లోనే నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత తెలుగులో రిలీజవుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి.

శింబు, నయనతార ప్రేమించుకొని బ్రేకప్‌ అయిన చాలాకాలం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరికీ కథ బాగా నచ్చి చేసిన చిత్రం ఇది. వాళ్లిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ అన్నీ చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే విధంగా ఈ చిత్రం వుంటుంది. శింబు సోదరుడు టి.ఆర్‌. కురళరసన్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ కాబోతోంది.

హీరో శింబు మాట్లాడుతూ – ”మన్మథ’, ‘వల్లభ’ చిత్రాలు తెలుగులో రిలీజై సూపర్‌హిట్‌ అయిన విషయం అందరికీ తెల్సిందే. మళ్లీ కొద్దికాలం గ్యాప్‌ తర్వాత ‘సరసుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రం తమిళంలో రిలీజై నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా ‘మన్మథ’, ‘వల్లభ’ చిత్రాల కంటే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను.” అన్నారు.