Saranga Dariya - మరో బిగ్ రికార్డ్

Tuesday,April 06,2021 - 11:39 by Z_CLU

లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా సాంగ్ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ లిరికల్ సాంగ్ మరో పెద్ద రికార్డ్ సృష్టించింది. ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకుంది.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న సినిమా ల‌వ్ స్టోరీ. సినిమాలో ఉన్న సారంగ‌ద‌రియా పాట ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా విడుద‌లై షార్ట్ టైమ్ లోనే పెద్ద హిట్టయింది. అతి త‌క్కువ రోజుల్లో దాదాపుగా 101 మిలియన్ల వ్యూస్ తో ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్ లో చేరింది.

గ‌తంలో వ‌రుణ్ తేజ్, సాయిప‌ల్ల‌వి, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో వ‌చ్చిన ఫిదా మూవీ ఆడియోని కూడా ఆదిత్య మ్యూజిక్ వారే విడుద‌ల చేశారు. ఫిదా ఆడియోలోని వ‌చ్చిండే పాట కూడా ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్ చోటు ద‌క్కించుకుంది.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై 100 మిలియ‌న్లు పైన వ్యూస్ ద‌క్కించుకున్న సాంగ్స్

అల‌వైకుంఠ‌పురంలో – బుట్ట‌బొమ్మ – 575 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో – రాములో రాముల – 353 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న – 227 మిలియన్లు
అల‌వైకుంఠ‌పురంలో – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న – 173 మిలియ‌న్లు
ఫిదా – వ‌చ్చిందే – 295 మిలియ‌న్లు
ఉప్పెన – నీ క‌ళ్లు నీలి స‌ముద్రం – 204 మిలియ‌న్లు
డీజే – సీటిమార్ – 202 మిలియ‌న్లు
ఛ‌లో – చూసి చూడంగానే – 169 మిల‌యిన్లు
ఎమ్ సి ఏ – ఏవండోయ్ నాని గారు – 118 మిలియ‌న్లు
గీత గోవిందం – ఇంకేం ఇంకేం కావ‌లే – 115 మిలియ‌న్లు
గీత‌గోవిందం – ఇంకేం ఇంకేం కావ‌లే – 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం – వ‌చ్చింద‌మ్మ – 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం – ఏంటి ఏంటి – 102 మిలియ‌న్లు
ల‌వ్ స్టోరీ – సారంగ‌దరియ – 101 మిలియ‌న్లు

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics