అదరగొట్టేసాడు....

Monday,October 03,2016 - 11:32 by Z_CLU

టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరో అవతారమెత్తిన స్టార్ కమెడియన్స్ ఎవరా? అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్… సునీల్ కంటే ముందే కమెడియన్ నుండి హీరో గా మారాడు ఆలి. కానీ హీరో గా ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాడు. అందుకే ఇప్పటి వరకూ తన కామెడీతో అలరిస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగి తక్కువ సమయం లోనే గొప్ప గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో కొనసాగుతున్న సప్తగిరి తాజాగా హీరోగా మారిపోయాడు.

sapthagiri-express

టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, అనుకోకుండా కమెడియన్ గా మారి ప్రేమకథా చిత్రంలో తనదైన కామెడీతో అలరించి ఆ తరువాత నటుడిగా వరుస అవకాశాలు అందుకున్నాడు. సప్తగిరి స్టార్ కథానాయకుడిగా అలరించడానికి సిద్దమవుతున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అంటూ కామెడీ కథానాయకుడిగా ఎక్స్ ప్రెస్ లా దూసుకురానున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరి సునీల్ దారిలో వెళ్తున్న ఈ స్టార్ కమెడియన్ హీరో గా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా? చూడాలి..