స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' 

Saturday,September 30,2017 - 10:06 by Z_CLU

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో హీరోగా పరిచయమైన కమెడియన్ సప్తగిరి ప్రస్తుతం మరో రిమేక్ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవ్తున్నాడు..సప్తగిరి హీరోగా హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’ పార్ట్‌-1’ని ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ గా తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్విట్జర్లాండ్ లో సాంగ్స్ షూటింగ్ జరుపుకుంటుంది.

సెప్టెంబర్‌ 22 నుంచి స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణతో ప్రారంభమైన ఈ షెడ్యుల్ అక్టోబర్‌ 5 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్‌లో 3 పాటలను చిత్రీకరించనున్నారు యూనిట్. ఈ షెడ్యుల్ తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్ పై డా.రవికిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తుండగా విజయ్‌ బుల్గానిన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్‌ మాటలు అందించడం మరో విశేషం. అక్టోబర్‌ చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.