సెన్సార్ పూర్తిచేసుకున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్

Wednesday,November 30,2016 - 07:00 by Z_CLU

కమెడియన్ సప్తగిరి హీరోగా మారి చేసిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఆడియో విడుదల వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది.

saptagiri-express-2

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘యు/ఏ’ రేటింగ్ తో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ తెలిపారు. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో… సునీల్ టైపులో హీరోగా ఫిక్స్ అయిపోవాాలని చూస్తున్నాడు సప్తగిరి.