టీజర్ తో సందడి చేస్తున్న సప్తగిరి

Sunday,November 05,2017 - 09:15 by Z_CLU

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో హీరోగా పరిచయమైన కమెడియన్ సప్తగిరి  మరో రీమేక్ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవ్తున్నాడు..సప్తగిరి హీరోగా హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి పార్ట్‌-1’ని ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ గా తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను రిలీజ్ చేశారు యూనిట్. ఈ టీజర్ తో  అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి  చేస్తున్నాడు సప్తగిరి.

సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్ పై డా.రవికిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తుండగా విజయ్‌ బుల్గానిన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్‌ మాటలు అందించడం మరో విశేషం. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.