సంక్రాంతి సినిమాలు

Monday,January 07,2019 - 03:40 by Z_CLU

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర నాలుగు బడా సినిమాలు పోటీ పడుతున్నాయి.. బాలయ్య నటించిన ‘NTR కథానాయకుడు’ తో మొదలైన సంక్రాంతి సినిమాల సీజన్ ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘పేట’, చరణ్ ‘వినయ విధేయ రామ’ తో కొనసాగుతూ వెంకటేష్ -వరుణ్ తేజ్ F2తో ముగియనుంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ని మరింత స్పెషల్ చేస్తూ రిలీజవుతోన్న నాలుగు సినిమాలపై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

జనవరి 9న సంక్రాంతి స్పెషల్ గా రిలీజవుతోంది ‘NTR కథానాయకుడు’… నందమూరి తారకరామారావు గారి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించారు నటసింహం బాలయ్య. సాంగ్స్ , ట్రైలర్స్ తో హంగామా చేస్తున్న ఈ సినిమాపై అటు నందమూరి అభిమానుల్లో , ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


ఈ సంక్రాంతి కి ‘పేట’ సినిమాతో స్పెషల్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు సూపర్ రజినీ కాంత్… రజినీఫైడ్ అంటూ సూపర్ స్టార్ ని సూపర్ లుక్ లో చూపించి ఎట్రాక్ట్ చేస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజు. టీజర్, ట్రైలర్స్ కూడా ఈసారి రజినీ కచ్చితంగా మేజిక్ రిపీట్ అవ్వనుందని చెప్తున్నాయి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జనవరి 10న థియేటర్స్ లోకి రానుంది.


బాలయ్య , రజినీ ల తర్వాత వినయ విధేయ రామ అనే పవర్ ఫుల్ యాక్షన్ సినిమాతో జనవరి 11న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బోయపాటి మార్క్ ఫ్యామిలీ & యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో మాస్ ఆడియన్స్ ని స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తుంది.

జనవరి 12న ‘F2’ సినిమాతో సంక్రాంతి అల్లుళ్ళు గా థియేటర్స్ లో అడుగుపెడుతున్నారు విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫ్యామిలీ & ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో క్లీన్ ఫ్యామిలీ మూవీ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ నాలుగు సినిమాలతో ఈ సంక్రాంతి సినీ ప్రేమికులకు మరింత స్పెషల్ గా మారబోతుంది.