Sankranthi Race - అందరికీ పండగే కావాలి
Wednesday,September 16,2020 - 01:08 by Z_CLU
ప్రతీ ఏడాది సంక్రాంతికి 3-4 సినిమాలు పోటీ పడుతూ థియేటర్స్ లో అడుగుపెడతాయి. కానీ ఈసారి రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య పెరగబోతుందని సమాచారం. అవును.. కరోనా కారణంగా విడుదల వరకు వచ్చి ఆగిన సినిమాలతో పాటు షూటింగ్స్ వాయిదా వేసుకున్న సినిమాలు కూడా ఇప్పుడు వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

Pawan-kalyan-vakeel-saab-movie-stills-zeecinemalu
ఇప్పటికే Nithin ‘RangDe’, Akhil ‘Most Eligible Bachelor’ సినిమాలు Sankranthi Release అంటూ ఎనౌన్స్ అయ్యాయి. వీటితో పాటు ఇప్పుడు Ram ‘Red’, RaviTeja ‘Krack’ సినిమాలు కూడా జనవరిలోనే రిలీజ్ కి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇక Vaishnav tej ‘Uppena’ లాంటి సినిమాలు కూడా జనవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ‘Vakeel Saab’ సినిమా కూడా సంక్రాంతికే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంకా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడు అందరి కన్ను రాబోయే సంక్రాంతి సీజన్ మీద పడుతుంది. మరి వీటిలో ఏ సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయో చూడాలి.