సంక్రాంతి సినిమాలపై క్లారిటీ

Monday,December 28,2020 - 04:14 by Z_CLU

మొత్తానికి సంక్రాంతి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చేసింది. షార్ట్ గ్యాప్ లో 3 సినిమాలు డేట్స్ లాక్ చేశాయి. ఇంకో 2 సినిమాలు లైన్లో ఉన్నాయి.

vijay-master-telugu-movie

ఎప్పట్లానే ఈసారి కూడా సంక్రాంతి బాక్సాఫీస్ హంగామా డబ్బింగ్ మూవీతో మొదలుకాబోతోంది. విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా జనవరి 13న థియేటర్లలోకి వస్తోంది. రీసెంట్ గా విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా హిట్టవుతున్నాయి. దీనికి తోడు మాస్టర్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

Ram-RED-movie-release-date

మాస్టర్ వచ్చిన 24 గంటలకు రామ్ తన రెడ్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ రామ్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఇది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. తడమ్ అనే సినిమాకు రీమేక్ గా వస్తున్న రెడ్ లో హీరోయిన్లు గా మాళవిక శర్మ, అమృతా అయ్యర్, నివేత పెతురాజ్ నటించారు.

krack-raviteja-january-14-release

రెడ్ తో పాటు థియేటర్లలోకి వస్తున్న సినిమా క్రాక్. రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా కూడా జనవరి 14నే వస్తోంది. గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ కాప్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

alludu-adhurs-movie-january-15-release 2

ఇక బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాను కూడా సంక్రాంతికే లాక్ చేశారు. జనవరి 15న ఈ మూవీ థియేటర్లలోకి వస్తోంది. సంతోష్ శ్రీనివాస్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లు. కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది.

ఈ సినిమాలతో పాటు మరో 2 సినిమాలు సంక్రాంతి బరిలో దిగే ఛాన్స్ ఉంది. అవేంటనేది త్వరలోనే తెలుస్తుంది. సంక్రాంతి నాటికి థియేటర్లలో రూల్స్ మారి 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నమ్మకంతోనే ఇలా 4 సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి.