సంకల్ప్ రెడ్డి ఇంటర్వ్యూ

Friday,December 14,2018 - 06:07 by Z_CLU

జస్ట్ ప్రీ ప్రొడక్షన్ మాత్రమే కాదు, టెస్ట్ షూట్ కూడా చేసుకుని మరీ సెట్స్ పైకి వస్తాడు  దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన ఫస్ట్ సినిమా ‘ఘాజీ’ కి ఎలాగైతే పక్కా ప్రిపరేషన్స్ తో సెట్స్ పైకి వచ్చాడో, ఇప్పుడు ‘అంతరిక్షం’ సినిమాకి కూడా అంతే ఎఫర్ట్ పెట్టాడు. సినిమా అనుకున్న దాని కన్నా అద్భుతంగా వచ్చిందని కాన్ఫిడెంట్ గా, రిలాక్స్డ్ గా ఉన్న ఈ యంగ్ డైరెక్టర్, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మీడియాతో చెప్పుకున్నాడు. అవి మీకోసం… 

అప్పుడు అంతే.. ఇప్పుడు అంతే..

వైజాగ్ లో సబ్ మెరీన్ చూసిన తరవాత ‘ఘాజి’ సినిమా ఐడియా వచ్చింది అలాగే, పేపర్ లో ఒక ఇన్సిడెంట్ చదువుతుంటే ఈ ఐడియా వచ్చింది. ‘అంతరిక్షం’ గురించి అంతకన్నా ఒక్క పాయింట్ ఎక్కువ చెప్పినా, సినిమా స్టోరీ రివీల్ అయిపోతుంది.

అస్సలు సంబంధం లేదు…

సినిమా టీజర్ రిలీజైన తరవాత చాలా కంపారిజన్స్ వచ్చాయి కానీ, ఈ సినిమాకి ఇప్పటి వరకు రిలీజైన ఏ హాలీవుడ్ సినిమాతో గానీ, ఇండియన్ సినిమాతో గాని అస్సలు సంబంధం లేదు.

అప్పటి నుండి…

చాలా షార్ట్ టైమ్ లో సినిమాని తెరకెక్కించాం. మే 2 నుండి షూటింగ్ బిగిన్ చేస్తే, డిసెంబర్ 21 కి సినిమా రిలీజ్ అవుతుంది అంటే, జస్ట్ 8 నెలల్లో కంప్లీట్ చేశాం. సినిమాలో 1500+ CG షాట్స్ ఉన్నాయి. 70 రోజులు సినిమా షూట్ చేస్తే, అందులో 40 రోజులు 0 గ్రావిటీ కండిషన్ లో చేశాం.

ఇంటర్నెట్ లోనే…

‘ఘాజీ’ సినిమా కోసం ఎంత రీసర్చ్ చేశానో, ఈ సినిమాకు కూడా అంతే రీసర్చ్ చేశా. బెంగళూరులో కొంతమంది సైంటిస్ట్ లను కలిశా. చాలా వరకు మనకు ఇంటర్నెట్ లోనే ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. దానికి తోడు ఈ సినిమా డాక్యుమెంటరీ కాదు కాబట్టి, అన్ని రియలిస్టిక్ గా పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అంత లాజిక్ అవసరం లేదు.

అదీ లెక్క…

సినిమా చూసేటప్పుడు ఆడియెన్స్ 100% లాజిక్ ఎక్స్ పెక్ట్ చేస్తారని నేననుకోను. ఒకసారి సినిమాకి కనెక్ట్ అయ్యారంటే అదే ఫ్లో లో ఎంజాయ్ చేస్తారు. కథ నచ్చకపోతే, కనెక్ట్ అవ్వకపోతేనే లాజిక్స్ గురించి మాట్లాడతారు. సినిమా అన్నాక సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం జరుగుతుంది.

ప్రీ ప్రొడక్షనే అస్త్రం…

నాకు సినిమా ప్రీ ప్రొడక్షన్ అంటేనే చాలా ఇష్టం. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. స్క్రిప్ట్ దగ్గరి నుండి స్టోరీబోర్డ్ వరకు ప్రతీది ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఈ సినిమాకి కూడా స్క్రిప్ట్ చెప్తే ఎవరు సినిమా చేయడానికి ముందుకు రారు. ప్రీ ప్రొడక్షన్ చూశాకే ఓకె అన్నారు.

చిన్న సినిమా అస్సలు చేయను…

చిన్న సినిమాకి ఎంత కష్టపడాలో, పెద్ద సినిమాకి కూడా అంతే కష్టపడాలి. అలాంటప్పుడు చిన్న సినిమా ఎందుకు చేయలి..? అస్సలు చేయను… బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలో బాలీవుడ్ సినిమా ఉంటుంది.

వన్ అండ్ ఓన్లీ వరుణ్ తేజ్…

ఈ సినిమాకు ఫస్ట్ నుండి వరుణ్ తేజ్ అనే అనుకున్నా. వరుణ్ తేజ్ ని కలిసినప్పుడు ఫస్ట్ ఒక ఫోటో చూపించి, సినిమా మొత్తం దీని చుట్టే ఉంటుందని చెప్పి, జస్ట్ 2 లైన్స్ చెప్పా. అంతే ఓకె అనేశాడు. ఆ తరవాత మొత్తం స్టోరీ చెప్పా.

‘ఘాజి’ కి ఈ సినిమాకి…

‘ఘాజి’ సినిమాలో హీరోయిన్ కి అంత స్కోప్ ఉండదు కానీ, ఈ సినిమాలో ఉంటుంది. అంతరిక్షం లో లవ్, దేశభక్తి, ఇమోషన్స్ అన్నీ ఉంటాయి.

అదీ సంగతి…

షూటింగ్ టైమ్ లో చాలా సైలెన్స్ ఉంటుంది నా సెట్ లో. నేను మా D.O.P. నే మాట్లాడుకుంటాం. ఇక 40 రోజుల పాటు మా యాక్టర్స్ రోప్స్ కట్టేసి గాల్లోనే ఉండేవాళ్ళు. సెట్ కి రాకముందే స్టోరీ బోర్డ్ దగ్గరి నుండి డైలాగ్స్ వరకు  ఎక్స్ ప్లేన్ చేసి, ఆల్రెడీ రిహార్సల్స్ కూడా చేసి ఉంటారు కాబట్టి, ఫుల్ ఫోకస్డ్ గా ఉండేవాళ్ళు.

అప్పుడే వెబ్ సిరీస్…

వెబ్ సిరీస్ కూడా చేసే ఆలోచనలున్నాయి కానీ, ప్రస్తుతానికి సినిమానే ఫస్ట్ ప్రయారిటీ. ఇక నాకు సినిమా చేసే అవకాశాలు రావట్లేదు అన్నప్పుడు వెబ్ సిరీస్ చేయడం బిగిన్ చేస్తాను.

నో స్పెషల్ ట్రాక్స్…

సినిమాలో కావాలని లవ్ ట్రాక్ పెట్టలేదు. వరుణ్ తేజ్ పర్సనల్ లైఫ్ కూడా ఓ వైపు నుండి డ్రైవ్ అవుతూంటుంది. ఈ ప్రాసెస్ లో లవ్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటికి అదితి రావు హైదరి క్యారెక్టర్ కనెక్టివిటీ ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

సెన్సార్ క్లియరైంది…

చాలా రిలాక్స్డ్ గా ఉన్నా. రేపటితో CG వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. విజువల్స్ కానీ, సౌండ్ కానీ ఫంటాస్టిక్ గా వచ్చాయి. సెన్సార్ క్లియర్ అయి క్లీన్ ‘U’ సర్టిఫికెట్ వచ్చింది.

అంతరిక్షం 2 ఉంటుంది…

బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి ఆల్రెడీ స్టోరీ చెప్పడం జరిగింది. కానీ అది అన్ని కుదిరి సెట్స్ పైకి తీసుకురావాలంటే  ఇంకో 2 ఇయర్స్ పడుతుంది. అలా కాకుండా ఇంకా టైమ్ పడుతుంది అనుకుంటే ఇదే బ్యానర్ లో నెక్స్ట్ సినిమా చేస్తా. అంతరిక్షం 2 చేద్దామనే ఆలోచనలో ఉన్నాం.