సంజు వీకెండ్ కలెక్షన్

Monday,July 02,2018 - 11:44 by Z_CLU

ఫస్ట్ వీకెండ్ కే వంద కోట్లు కలెక్ట్ చేసింది సంజు. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 120 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. అటు రణబీర్ కపూర్ కెరీర్ తో పాటు, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సంజు మూవీ. ఇక ఈ ఏడాది హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం కూడా ఇదే.

సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది సంజు సినిమా. కంటెంట్ పరంగా కంప్లయింట్స్ ఉన్నప్పటికీ, దర్శకుడు చూపించిన ఎమోషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. దీనికి తోడు రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ కు టోటల్ ఇండియా అంతా ఫిదా అయింది. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

సంజు వీకెండ్ నెట్ (ఇండియా)
శుక్రవారం – రూ. 34.75 కోట్లు
శనివారం – రూ. 38.60 కోట్లు
ఆదివారం – రూ. 46.71 కోట్లు