ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ విలన్ !

Thursday,April 16,2020 - 02:00 by Z_CLU

RRR తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రస్తుతం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కి ఆర్టిస్టులను ఎంచుకునే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కోసం సంజయ్ దత్ ను సంప్రదించారట.

విలన్ గా సంజయ్ దత్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫిక్సయినట్టు సమాచారం. ప్రస్తుతం ‘KGF చాప్టర్2’ లో విలన్ గా నటిస్తున్నాడు సంజయ్ దత్.

మరి సంజయ్ దత్ ను త్రివిక్రమ్ ఒప్పించి ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొస్తాడా లేదా అన్నది కొన్ని రోజుల్లో తెలియనుంది.

హారిక హాసినీ క్రియేషన్స్ & ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ కంబైన్ గా రాబోతున్న ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినాకు అనే టైటిల్ అనుకుంటున్నారు. RRR షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి వస్తుంది.