అప్పుడు మహేష్ బాబు ఇప్పుడు ప్రభాస్

Monday,December 23,2019 - 04:27 by Z_CLU

సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్… ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హాట్ టాపిక్. ఈ డైరెక్టర్ ప్రభాస్ కి స్టోరీ ఎప్పుడు చెప్పాడు…? ఇంతకీ ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అనేది పక్కన పెడితే… సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబుతో సినిమా పక్కన పెట్టేసినట్టేనా…? లేకపోతే ప్రభాస్ తో సినిమా అనేది జస్ట్ రూమరా..?

‘కబీర్ సింగ్’ తరవాత సందీప్ రెడ్డి వంగ చేయబోయేది ఖచ్చితంగా బాలీవుడ్ సినిమానే. మహేష్ బాబుతో అప్పట్లో సినిమా అనుకున్నా, డేట్స్ కుదరకపోవడం ఈ డైరెక్టర్ ని బాలీవుడ్ కి మరింత దగ్గర చేసింది. ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్ ఇప్పట్లో తెలుగు సినిమా చేయడు అని తెలుగు ఆడియెన్స్ ఫిక్స్ అయిన ఈ టైమ్ లో ప్రభాస్ తో సినిమా అనేసరికి న్యాచురల్ గానే వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

అప్పట్లో మహేష్ బాబు తో సందీప్ రెడ్డి సినిమా అనుకున్నప్పుడు కూడా టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ భారీ క్యూరియాసిటీ జెనెరేట్ అయింది. ఇప్పుడు అదే ప్లేస్ లో ప్రభాస్ పేరు వినిపిస్తుంది. చూడాలి మరీ ఈ టాక్ జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందా..? అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా…?