మహేష్ కోసం సందీప్ రెడీ...

Thursday,June 13,2019 - 01:02 by Z_CLU

‘అర్జున్ రెడ్డి’ తరవాత చెప్పాడు మహేష్ బాబుకి కథ. అప్పుడే డేట్స్ లేకపోవడంతో ఈలోపు బాలీవుడ్ లో అదే సినిమా రిమేక్ ప్లాన్ చేసుకున్నాడు. ‘కబీర్ సింగ్’ ఈ నెల 21 న రిలీజవుతుంది. దీంతో సందీప్ మహేష్ బాబు సినిమాకి రెడీ అయిపోయినట్టే.

ఈ సినిమాకి సంబంధించి సగం నేరేషన్ అయిపోయింది. మహా అయితే బ్యాలన్స్ ఉన్న స్క్రిప్ట్ వర్క్ కాస్త కంప్లీట్ చేసుకుంటే, సూపర్ స్టార్ ఎపుడు రెడీ అంటే అపుడు సందీప్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చేస్తాడు.

ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి తరహాలోనే క్యారెక్టర్ ఓరియంటెడ్ స్టోరీ అని తెలుస్తుంది. దానికి తోడు మహేష్ బాబు కోసం అవుట్ అండ్ క్రైమ్ డ్రామాని ప్లాన్ చేసుకుంటున్నాడు.

కబీర్ సింగ్ కూడా బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. వైబ్స్ చూస్తుంటే సందీప్ రెడ్డి వంగ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ఫిలిమ్ మేకర్ అనిపించుకునే చాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి.