ట్రాక్ లో పడ్డ సందీప్ కిషన్

Monday,July 17,2017 - 12:07 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్. లేటెస్ట్ రిలీజ్ ‘శమంతకమణి’ లో ‘కోటిపల్లి శివ’ గా ఎంటర్ టైన్ చేసిన ఈ యంగ్ హీరో, ఫ్యాన్స్ లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. పల్లెటూరి కుర్రాడిగా, గర్ల్ ఫ్రెండ్ కి బుద్ధి చెప్పే ఇమోషన్స్ సీన్స్ లోను అద్భుతంగా పర్ఫామ్ చేసిన సందీప్ కిషన్, కృష్ణవంశీ  నక్షత్రం లో  మరో షేడ్ లో కనిపించబోతున్నాడు.

‘నక్షత్రం’ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించనున్న సందీప్ కిషన్, ఈ సినిమాలో అటు యాక్షన్, ఇటు ఇమోషన్స్ సీన్స్ లలో ఇరగదీసేసాడు అంటుంది సినిమా యూనిట్.  సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమా క్రియేట్ చేస్తున్న  వైబ్రేషన్స్ చూస్తుంటే సినిమా సక్సెస్ గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ అకౌంట్ లో మరో ఇంటరెస్టింగ్ వెంచర్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

 

 

‘నా పేరు శివ’ లాంటి ఇంటరెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన సుసీంథిరన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘C/o సూర్య’ లోను వెరైటీ రోల్ ప్లే చేస్తున్నాడు సందీప్ కిషన్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినీటౌన్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలతో పాటు సందీప్ కిషన్ చేతిలో మరికొన్ని సబ్జెక్ట్స్ ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.