RRR కంటే ముందే రెండు సినిమాలు

Tuesday,January 12,2021 - 03:54 by Z_CLU

దర్శకుడు కమ్ నటుడు సముద్రఖని ఈ ఏడాది కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమాలో పార్ట్ అయి మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సముద్రఖని తాజాగా ‘క్రాక్’ సినిమాలో విలన్ గా కనిపించాడు.

అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు తెలుగులో సముద్రఖని కమిట్ అయిన సినిమా RRR. ‘మగధీర’ నుండి రాజమౌళితో పరిచయం ఉందని బాహుబలి తర్వాత ఆయన పిలిచి మరీ RRR లో అవకాశం ఇచ్చారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు సముద్రఖని.

కానీ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కమిట్ అయిన రెండు సినిమాలు మాత్రం ముందే రిలీజయ్యి తెలుగు ప్రేక్షకులకు నటుడిగా తనను దగ్గర చేసాయని అన్నారు.

“నటుడవ్వాలనే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాను, కానీ తొలుత ఆ ప్రయత్నాలు విఫలం అవ్వడంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ చేరాను అంటూ” చెప్పుకున్నాడు సముద్రఖని. అయితే ఇప్పుడు నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉండటం తనకి ఎంతో తృప్తినిస్తుందని చాలా సంతోషంగా ఉందని తెలియజేసాడు.

ప్రస్తుతం సముద్రఖని నటించిన ‘ఆకాశవాణి’ రిలీజ్ కి రెడీ గా ఉండగా ‘RRR’ సెట్స్ పై ఉంది. త్వరలోనే తమిళ్ , తెలుగు భాషల్లో దర్శకుడిగా ఓ బైలింగ్వెల్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.