ఓ బేబీ ట్రయిలర్: 24 ఏళ్ల బామ్మ హంగామా

Thursday,June 20,2019 - 11:30 by Z_CLU

సమంత ఓ సినిమా చేసిందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఓ బేబీ కూడా ఆ లైన్లో సినిమానే. ఈరోజు రిలీజైన ఈ సినిమా ట్రయిలర్ చూస్తే సమంత ఎందుకు ఈ సినిమా ఒప్పుకుందో ఇట్టే అర్థమైపోతుంది.

సినిమా కథేంటి.. సమంత క్యారెక్టర్ ఏంటి.. లాంటి డౌట్స్ అక్కర్లేదు. ట్రయిలర్ లో మేటర్ మొత్తం చెప్పేశారు. చిన్న చిన్న ట్విస్టులతో పాటు మిగతా బ్యాలెన్స్ సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడమే.

70 ఏళ్ల బామ్మ.. 24 ఏళ్ల పడుచుపిల్లగా మారుతుంది. కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంది. బంధాలు మారిపోతుంటే సర్దుకుంటుంది. కానీ అనుబంధాలే మారిపోతుంటే ఇమడలేక ఇబ్బంది పడుతుంది. ఇలా ఎంతో ఫన్, ఇంకొంత ఎమోషన్ తో వస్తోంది ఓ బేబీ.

పూర్తిగా సమంత స్టార్ డమ్, స్టామినా మీద డిపెండ్ అయి తీసిన ఈ సినిమా వచ్చేనెల 5న థియేటర్లలోకి వస్తోంది. నందినీరెడ్డి డైరక్షన్ చేయగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇచ్చాడు. సురేష్ బాబు, విశ్వప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు.