మంచి పనులతో ముందుకెళ్తోంది....

Tuesday,September 20,2016 - 09:00 by Z_CLU

సినిమాలతో ఇప్పటికే సూపర్ హిట్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత… మంచి పనులతో కూడా అందరి మనసు దోచుకుంటోంది. నటించే టాలెంట్ మాత్రమే కాదు… సాయం చేసే మనసు కూడా ఉందని ఇప్పటికే నిరూపించుకుంది. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఆమె స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్… ఎంతోమంది అభాగ్యులకు సాయం చేస్తోంది. మరెంతోమంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తోంది. తాజాగా సినిమాలు తగ్గించిన సమంత… ఇప్పుడు పౌండేషన్ కార్యకలాపాల్లో మరింత చురుగ్గా పాల్గొంటోంది. హైదరాబాద్ లో చురుగ్గా ఉన్న ఫౌండేషన్ యాక్టివిటీస్ ను తెలుగు రాష్ట్రాలకు మరింతగా విస్తరింపజేయాలనుకుంటోంది.

samantha-1

ఇందులో భాగంగా… ఓ అరుదైన వేలం పాటకు రెడీ అవుతోంది సమంత. టాలీవుడ్ టాప్ హీరోలకు చెందిన వస్తువులు, దుస్తులను వేలం వేసి… ఆ వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించాలనుకుంటోంది. ఈ ఆన్ లైన్ వేలం పాటను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేసుకున్న గబ్బర్ సింగ్ డ్రెస్ తో స్టార్ట్ చేయబోతోంది సమంత. చాలా రోజుల కిందటే పవన్ ను రిక్వెస్ట్ చేసి ఆ దుస్తులు సంపాదించింది. సమంత చేస్తున్న మంచి పనిని మెచ్చుకుంటూనే… ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉంటానని పవన్ వ్యక్తిగతంగా సమంతకు మాటిచ్చాడు. పవన్ గబ్బర్ సింగ్ డ్రెస్ తో మొదలుకానున్న ఈ వేలం పాటలో మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించిన యాక్సెసిరీస్ కూడా ఆక్షన్ కు రాబోతున్నాయి.

samantha-2