Shaakuntalam సమంత ఫస్ట్ లుక్ రిలీజ్

Monday,February 21,2022 - 02:36 by Z_CLU

Samantha’s first look from ‘Shaakuntalam’ released

సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్  తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. దుష్యంతుడు – శ‌కుంత‌ల మ‌ధ్య ప్రేమ క‌థను ఆధారంగా చేసుకుని గుణ‌శేఖ‌ర్ ఈ ద‌శ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా నుండి సమంత ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Shakunthalam-first-look-released-zeecinemalu

ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే ఆశ్ర‌మంలో ముని క‌న్య పాత్ర‌లో స‌మంత కూర్చుని ఉంది. దేని కోస‌మో ఆమె క‌ళ్లు వెతుకుతున్నాయి. ఆమె చుట్టూ నెమ‌ళ్లు, జింక‌లు, హంస‌లు ఇత‌ర వన్య ప్రాణులు నిలుచుని ఆమెను చూస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి – గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ‘శాకుంతలం’ చిత్రానికి నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రాఫర్.ఈ సినిమాలో భ‌ర‌తుడి చిన్న‌ప్ప‌టి రోల్‌ లో  అల్లు అర్జున కూతురు అల్లు అర్హ కనపించనుంది.

త్వరలోనే సినిమా నుండి సాంగ్స్ రిలీజ్ అవ్వనున్నాయి. ప్రస్తుతం గుణ టీం వర్క్స్ విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించి చాలా టైం పట్టనుందని సమాచారం.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics