మరో రీమేక్ స్టార్ట్ చేయబోతున్న సమంత

Monday,May 27,2019 - 01:41 by Z_CLU

ఇప్పటికే ఓ రీమేక్ కంప్లీట్ చేసింది సమంత. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేగా వస్తున్న ఓ బేబీ షూటింగ్ పూర్తయింది. ఈ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు మరో రీమేక్ పై ఈ బ్యూటీ ఫోకస్ పెట్టింది. అదే 96 రీమేక్.

తమిళ్ లో హిట్ అయిన 96 సినిమాను దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది సమంత. నెక్ట్స్ షెడ్యూల్ లో సమంత-శర్వానంద్ మధ్య కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు శర్వానంద్. సౌతాఫ్రికాలో శర్వానంద్ పై కొన్ని సన్నివేశాలు తీశారు. నెక్ట్స్ షెడ్యూల్ లో సమంత-శర్వానంద్ పై సన్నివేశాలు తీయబోతున్నారు.

ఒరిజినల్ సినిమాను తీసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలోనే రీమేక్ రాబోతోంది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం యాజ్ ఇటీజ్ తీయడం లేదు. చాలా మార్పులు చేశారు. తెలుగులో ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.